Shanmukh new webseries: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, సూపర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్..ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డబ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త వెబ్‌సిరీస్‌ను తీసుకురానుంది. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఇందులో.. ఇప్పటివరకు వెబ్‌సిరీస్‌లలో లవర్‌బాయ్‌గా అలరించిన యూట్యూబర్, 'బిగ్‌బాస్-5' ఫేమ్ షణ్ముఖ్.. డిటెక్టివ్‌గా మెప్పించనున్నాడు. ఏజెంట్ ఆనంద్ సంతోష్‌గా కనిపించనున్నాడు. దీనికి అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తుండగా.. సుబ్బు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో షణ్ముఖ్.. చేతిలో సూట్‌కేస్ పట్టుకుని ఉండగా.. దానిపై కేస్ క్లోజ్డ్ అని రాసి ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆహా తెలిపింది.
Naveen chandra new movie: ఇటీవలే 'విరాటపర్వం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నవీన్‌చంద్ర మరో కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మరోసారి దర్శకుడు శ్రీకాంత్ నగోతితో ఆయన మూవీ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'మంత్ ఆఫ్ మధు' అని పేరు ఖరారు. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రేమ కథ నేపథ్యంలో రూపొందనుందని అర్థమవుతోంది. ఇందులో హీరోయిన్గా స్వాతి నటిస్తోంది. శ్రియ నవైల్, హర్ష చెముడు తదితురులు నటిస్తున్నారు. అచు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే టీజర్ సహా రిలీజ్ డేట్ వివరాలు ప్రకటించనున్నారు. కాగా, గతంలో చంద్ర-శ్రీకాంత్ కాంబోలో వచ్చిన భానుమతి రామకృష్ణ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.