Shahrukh Khan Dunki Movie :ఫ్యాన్స్‌తో మాట్లాడే విషయంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్టైలే వేరు. అది మన్నత్ దగ్గరైనా సరే ఫ్యాన్స్ మీట్లోనేనా సరే. ఇక ట్విట్టర్లో ఆయన ఫ్యాన్స్‌తో ముచ్చటించే తీరును పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. #ASK SRK అంటూ ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్స్కు షారుక్ ఎంతో కూల్లా ఆన్సర్స్ చెబుతుంటారు. ఏదైనా సినిమా రిలీజ్‌కు ముందు అలాగే రిలీజ్ తర్వాత ఇలా ఆయన సోషల్ మీడియా వేదికహగా ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. అలా తాజాగా 'డంకీ' సినిమా గురించి పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా బదులిచ్చారు.
'డంకీ'కి సంబంధించి మీకు బాగా నచ్చిన మూమెంట్స్? ఆ సినిమాలో మీకు ఇష్టమైన పాట?
షారుక్: మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఫన్నీ ఇంటర్వ్యూలు. అలాగే ఈ సినిమాలో 'ఓ మహీ' పాట నాకెంతో నచ్చింది.
'పఠాన్', 'జవాన్', 'డంకీ' ఈ మూడింటిలో ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా శ్రమించారు?
షారుక్: వైవిధ్యమైన ఎమోషన్స్‌ను పండించటం నటులకు కష్టమైన విషయం. ఆ విధంగా చూస్తే 'డంకీ' కోసం ఎక్కువగా కష్టపడ్డాను.
30 ఏళ్ల సినీ కెరీర్‌లో మీరు నేర్చుకున్న విషయం ఏమిటి?
షారుక్: ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడాని విలువైన బహుమతి మరొకటి లేదు.
ఈ రోజు సల్మాన్ ఖాన్ బర్త్‌డే. ఆయనకు విషెస్ చెప్పండి?
షారుక్: ఆ విషయం నాకు తెలుసు. నేను ఆయనకు విషెస్ కూడా చెప్పాను. అయితే నేను ఎప్పుడూ సోషల్‌మీడియాలో చెప్పను. ఎందుకంటే, ఇది పర్సెనల్ కదా.