తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అల్లు అర్జున్ సినిమాలు చూసి జవాన్​లో నటించా' - జవాన్​ మూవీ రిలీజ్ డేట్​

బాలీవుడ్​ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే ట్విట్టర్​ వేదికగా తన ఫ్యాన్స్​తో ముచ్చటించారు. 'జవాన్‌' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్​లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్​లో సమాధానమిస్తూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకుచ్చారు.

Shahrukh Khan Ask Me anything
Shahrukh Khan

By

Published : Jul 14, 2023, 7:44 AM IST

Shahrukh Khan Jawan : బాలీవుడ్‌ బాద్​షా షారుక్‌ ఖాన్‌ లీడ్​లో రోల్​లో తెరకెక్కుతున్న యాక్షన్​ ఎంటర్టైనర్ ​'జవాన్‌'. 'రాజా రాణీ' ఫేమ్​ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన హిందీ ప్రివ్యూ కూడా మంచి క్రేజ్​ సంపాదించుకున్న విషయం తెలిసిందే. నయనతార , విజయ్‌ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్స్​ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్‌ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో షారుక్ కూడా తన సినిమా ప్రమోషన్స్​ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ట్విటర్ వేదికగా #AskSRK పేరుతో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన కింగ్​ ఖాన్​.. 'జవాన్' సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అవేంటంటే..

Shahrukh Khan Ask me anything : 'జవాన్‌' సాంగ్స్​ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
షారుక్: సినిమాలోని అన్ని పాటలు కచ్చితంగా అందరినీ ఆకట్టకుంటాయని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతం వాటి ఎడిట్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే విడుదలవుతాయి.

'జవాన్‌'లో మీకు ఇష్టమైన యాక్షన్‌ సీన్​ ఏది?
షారుక్: ఈ సినిమాలో చాలా యాక్షన్‌ సీన్లు ఉన్నాయి. ట్రక్కులతో కూడిన ఓ ఫైటింగ్‌ సీన్‌ నాకు చాలా నచ్చింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీకు మరేదేమైనా నచ్చుతుందేమో.

నయనతార, విజయ్‌ సేతుపతితో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది?
షారుక్:నయనతార చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న నటి. అందరితోనూ ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉంటుంది. విజయ్‌ సేతుపతి కాస్త క్రేజీగా ఉంటారు. వాళ్లిద్దరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనిది.. 'జవాన్‌'లో మాత్రమే చేసిన పని ఏమైనా ఉందా?
షారుక్: తమిళంలో ఒక పాటలో కొన్ని లైన్లు పాడాను. యూనిట్ అంతా నన్ను చాలా ఆదరించారు. తమిళ ప్రేక్షకులు కూడా నన్నెంతో ప్రోత్సహిస్తున్నారు.

మీరు గుండులోనూ అందంగా ఉన్నారు.. మీకు ఎలా అనిపించింది?
షారుక్: నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా చాలా భిన్నమైన లుక్స్‌లో కనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

డైరెక్టర్​ అట్లీ గురించి చెప్పండి?
షారుక్: ఆయన చాలా సైలెంట్‌. సినిమాలో నన్ను బాగా చూపించాలని మాత్రమే ఎజెండాగా పెట్టుకొని కష్టపడి పనిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నిజంగా అద్భుతం.

'జవాన్‌'లో మీ పాత్రకు బాగా రావడానికి ఏమైనా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా?
షారుక్: అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలు కొన్ని చూశాను. అలాగే విజయ్‌ సేతుపతి, అల్లు అర్జున్‌, రజనీకాంత్, యశ్‌.. ఇలా చాలా మంది సినిమాలను చూశాను. వాటిని చూసి కొన్ని సన్నివేశాల్లో బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలో నేర్చుకున్నాను.

ఈ షూటింగ్ సమయంలో ఎన్నిసార్లు గాయపడ్డారు?
షారుక్: నా మనసుకు గాయం కానంత వరకు.. నాకు ఎన్ని దెబ్బలు తగిలిన పర్వాలేదు.

సౌత్‌ ఇండస్ట్రీ గురించి ఒక్క మాటలో చెప్పండి?
షారుక్: సౌత్​లో రెండేళ్లుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేనూ సౌత్‌ ఇండస్ట్రీకి అభిమానినే. ‘

'జవాన్‌' ట్రైలర్ చూసి మీ భార్య ఏమన్నారు?
షారుక్: ఆమెకు నచ్చింది. తను వాస్తవాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది.

ABOUT THE AUTHOR

...view details