తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పఠాన్'​ టికెట్స్​పై బంపర్​ ఆఫర్​.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే.. - పఠాన్​ అప్డేట్లు

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ​ఖాన్​ నటించిన పఠాన్​ సినిమా చూశారా?.. ఇంకా చూడకపోతే ఇది మీకోసమే. యశ్​రాజ్​ ఫిలింస్​ క్రేజీ ఆఫర్​ను ప్రకటించింది. ఒక సినిమా టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఆ వివరాలు..

shahrukh kahn pathan movie ticket offer on three days
shahrukh kahn pathan movie ticket offer on three days

By

Published : Mar 2, 2023, 8:52 PM IST

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన స్పై యాక్షన్​ థ్రిల్లర్​ చిత్రం 'పఠాన్'​. జనవరి 25న విడుదలైన ఈ సినిమా.. సూపర్​ పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్​ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. వసూళ్లు వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్​న్యూస్ చెప్పింది.

సినీ ప్రియుల కోసం యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది. పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది చిత్రబృందం.

పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు చెప్పింది.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించగా, డింపుల్‌ కపాడియా, అశుతోష్‌ రాణా కీ రోల్స్‌ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ABOUT THE AUTHOR

...view details