కొవిడ్ లాక్డౌన్ సమయంలో సినీ ప్రేక్షకులు ఆన్లైన్ కంటెంట్‌కు ఎక్కువగా అలవాటుపడిపోయారు. అప్పటి నుంచి అందరూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లనూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ప్రేక్షకులు ఈ వెబ్ కంటెంట్‌పై మక్కువ చూపించడం వల్ల.. ఇటీవలి కాలంలో స్టార్ నటీనటులు సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. అజయ్ దేవ్‌గణ్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, సమంత, వెంకటేశ్, రానా లాంటి పాపులర్ స్టార్స్ ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో సందడి చేయగా.. నాగ చైతన్య కూడా త్వరలో ఓ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు రానున్నారు.
ఇక నార్త్‌లో వెబ్‌సిరీస్ అంటే మనకు గుర్తుకొచ్చేవి మీర్జాపుర్, ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్‌లు రెండు సీజన్లు పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరించాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 2019లో రిలీజైన ఈ సిరీస్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దర్శకులు రాజ్, డీకేలకు ఈ సిరీస్‌తో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు కూడా లభించింది. దీంతో రాజ్, డీకే కాంబోలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ఫర్జీ వెబ్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. దొంగ నోట్లు ప్రింట్ చేసే కథాంశంతో ఫిబ్రవరిలో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో పాటు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేశారు.