తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇంజనీర్​- రోబోల మధ్య రొమాన్స్​..! క్రేజీ కాన్సెప్ట్​తో బాలీవుడ్​ చిత్రం - shahid kapoor latest news

మనుషుల మధ్య రొమాన్స్​ కామన్. మనిషి-రోబో మధ్య లవ్​ట్రాక్​ నడిస్తే.. ? ఇప్పటికే ఈ తరహా సన్నివేశాలను పలు చిత్రాల్లో చూసినా పూర్తిస్థాయిలో భారతీయ సినిమాలో అలాంటి చిత్రం రాలేదు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్​లో అలాంటి చిత్రం రానుందని టాక్. రోబో-ఇంజినీర్​ మధ్య జరిగే లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షాహిద్​ కపూర్​-కృతి సనన్ జంటగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

shahid kapoor
కృతిసనన్

By

Published : Aug 5, 2022, 7:37 PM IST

'2.0' చిత్రంలో రోబోలైన.. రజనీకాంత్​, అమీ జాక్సన్​లు డ్యూయెట్​లు పాడుకోవడం చూశాము. అంతకుముందు వచ్చిన 'రోబో' సినిమాలో కూడా చిట్టీ రోబో, సనా పాత్రల మధ్య చిన్న లవ్​ట్రాక్​ టచ్​ ఇచ్చారు ఆ సినిమా డైరెక్టర్. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఓ హ్యూమన్​-రోబో లవ్​ స్టోరీ తెరకెక్కుతోంది. వైవిధ్య చిత్రాల కోసం ప్రయత్నించే బాలీవుడ్​ ఈసారి ఈ కొత్త ఫార్ములాతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తోంది. ఈ సినిమాలో రోబోటిక్స్​ ఇంజినీర్​గా స్టార్​ హీరో షాహిద్​ కపూర్​ నటిస్తుండగా, షాహిద్​ రొమాన్స్​ చేసే రోబో పాత్రలో కృతిసనన్​ మెరవనుంది.

షాహిద్​ కపూర్

ఈ చిత్రానికి అమిత్​ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి-సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో రిలీజైన హాలీవుడ్​ చిత్రం 'ఎక్స్​ మెషీనా', 2016-17 మధ్య ప్రసారమైన 'బహు హమారీ రజనీకాంత్​' అనే సీరియల్​ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు షాహిద్​ కపూర్​ అలీ అబ్బాస్​ జాఫర్​ దర్శకత్వంలోని ఓ చిత్రంలో నటిస్తుండగా.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు కృతిసనన్​ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. భేడియా, ఆదిపురుష్​, గణ్​పథ్, షెహ్​జాదా ప్రాజెక్టుల్లో భాగమైంది.

షాహిద్​ కపూర్, కృతిసనన్​

ఇదీ చూడండి :షారుక్​ 'మన్నత్'​తో సల్మాన్​కు ఉన్న బంధం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details