Gopichand Malineni-Balakrishna movie దర్శకుడు గోపీచంద్ మలినేని- హీరో బాలకృష్ణ కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయిక. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. అక్కడే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని మరో కీలక షెడ్యూల్‌ను కూడా ఇటీవలే ప్రారంభించింది. ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో.. కీలకమైన పోరాట ఘట్టాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై తెరకెక్కించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్ షెడ్యూల్ పూర్తైనట్లు తెలిసింది. దీంతో కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తోందట! త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేయనుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది. విదేశీ నేపథ్యమూ ఇందులో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Hindi Jersy releasedate postpone: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమాకు విడుదల కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుని బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే తాజాగా మళ్లీ ఆ బరిలో నుంచి తప్పుకుంది. ఏప్రిల్ 13న కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్', ఏప్రిల్ 14న కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' విడుదల అవ్వడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ట్వీట్ చేసింది. భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో వారం రోజుల పాటు చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పింది.