Shahrukh Khan Mannat Name Plate: మన్నత్.. బాంద్రా బీచ్ రోడ్డులో వెళ్తుంటే బాలీవుడ్ బాద్షా షారుక్ నివాసానికి కేరాఫ్‌గా ఆయన ఇంటిముందు ఉండే పేరిది. అభిమానులు, ప్రముఖులు ఎవరైనా షారుక్‌ను కలవాలంటే మన్నత్ ముందు అడుగుపెట్టాల్సిందే. బీటౌన్‌లో షారుక్ ఇంటికి బ్రాండ్‌గా నిలిచిన ఈ నేమ్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వజ్రాలు పొదిగిన కొత్త నేమ్‌ప్లేట్ పెట్టించిన షారుక్.. ఫొటోలు దిగుతూ ఫ్యాన్స్ సందడే సందడి! - ముంబయిలో షారుక్ ఖాన్ నివాసం
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటికి కేరాఫ్ అయిన 'మన్నత్' కొత్త నేమ్‌ప్లేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వజ్రాలు పొదిగిన కొత్త నేమ్ ప్లేట్‌ను షారుక్ పెట్టించడంతో.. అభిమానులు ఆ ప్లేట్ దగ్గర ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి 'మన్నత్' కొత్త నేమ్ ప్లేట్ చూశారా?
కొన్ని నెలల క్రితం 'మన్నత్' నేమ్ ప్లేట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాద్షా.. మరో కొత్త నేమ్‌ప్లేట్‌ను తయారు చేయించారు. తాజాగా వజ్రాలు పొదిగిన కొత్త నేమ్ ప్లేట్‌ను షారుక్ పెట్టించారు. ఇంటి మెయిన్ డోర్‌కు ఓ వైపు మన్నత్ అని, మరో వైపు ల్యాండ్ సెండ్ అని రాసి ఉన్న ప్లేట్లను అతికించారు. వాటిని చూసి ఫిదా అయిన అభిమానులు ఫొటోలు తీసుకుని సోషల్‌మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ముంబయిలో సందర్శకులు ఎక్కువగా పర్యటించే ప్రదేశాల్లో షారుక్ ఖాన్ నివాసం 'మన్నత్' ఒక్కటి. వివిధ సందర్భాలలో షారుక్ కూడా తన ఇంటిపై నుంచి అభిమానులను పలకరిస్తుంటారు. సుమారు నాలుగేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఆయన ప్రస్తుతం చెేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'పఠాన్' చిత్రంలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంతో కలిసి నటిస్తున్నారు. సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.