Shah Rukh Khan Son School Fee :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా సమయం కేటాయించి కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు షారుక్. సెప్టెంబర్‌లో ముంబయి లాల్బాగ్చా వినాయక ఆలయానికి, రిసెంట్‌గా షిర్డీ సాయిబాబా మందిరానికి షారుక్ తన ఫ్యామిలీతోనే వెళ్లారు. అంటే సినిమాల నుంచి బ్రేక్ దొరికితే ఆయన కుటుంబానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో ఇది చూస్తే తెలుస్తోంది.
అయితే సాధారణంగా సెలబ్రెటీలు లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అంతేకాకుండా వారి ఫ్యామిలీ ఏంటి? పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ ఎక్కడ చదువుకుంటున్నాడు? అబ్రమ్ కోసం షారుక్ చెల్లిస్తున్న ఫీజు ఎంత? అనే విషయాలు మీకు తెలుసా?
షారుక్ ఖాన్ 1991లో గౌరీఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యన్ ఖాన్, సుహానాతోపాటు మూడో సంతానంలో అబ్రమ్ జన్మించాడు. షారుక్ దంపతులకు అబ్రమ్ గారాల తనయుడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన అబ్రమ్ ముంబయి ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ (LKG) చదువుతున్నాడు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్కువ మంది సెలబ్రెటీల పిల్లలే చదువుతుంటారు. అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పిల్లలు సారా టెందూల్కర్, అర్జున్ టెందూల్కర్ ఈ స్కూల్లో చదుకున్నవారే. కాగా, ప్రస్తుతం ఐశ్వర్యరాయ్- అభిషేక్ కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్లో చదువుతోంది.