బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పఠాన్ సినిమాతో రీసెంట్గా స్క్రీన్ పై మెరిసి బ్లాక్బాస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు రూ. 1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే మాములుగానే షారుక్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు ఉంటుందని టాక్. దీంతో పాటే లాభాల్లోనూ వాటాను తీసుకుంటారట. అయితే పఠాన్ సినిమాకు.. నిర్మాతలు రూ.100కోట్లు కన్నా భారీ మొత్తాన్ని షారుక్‌కు ఇచ్చారని తెలిసింది.
ఇంతకీ ఎంతంటే?.. 'పఠాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1050 కోట్లు వసూలు చేసింది! ఇందులో భారత్ నుంచే రూ.545 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ రూ. 270 కోట్లు అని అంచనా. అయితే ఈ మూవీకి వచ్చిన లాభాల్లో షారుక్ దాదాపు 60 శాతం వాటా అడిగారట. ఫైనల్‌గా దాదాపు రూ.200కోట్ల వరకు తీసుకున్నారని తెలిసింది. ఈ పారితోషికం.. రీసెంట్గా బ్లాక్బాస్టర్గా నిలిచిన భారీ చిత్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అలా షారుక్.. కేజీయఫ్ చాప్టర్ 2 (రూ. 100 కోట్లు), పద్మావత్ (రూ. 180 కోట్లు), బాహుబలి (రూ. 180 కోట్లు) బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం..