తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే? - షూటింగ్​లో షారుక్ ఖాన్​కు గాయం

Shah rukh khan injured : బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​కు​ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్​లో గాయపడ్డారట. ఆ వివరాలు..

Shah Rukh Khan injured
Shah Rukh Khan injured

By

Published : Jul 4, 2023, 1:20 PM IST

Updated : Jul 4, 2023, 1:42 PM IST

Shah rukh khan injured : 'పఠాన్‌' సినిమా విజయంతో ఫుల్ జోష్​లో ఉన్న బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా షూటింగ్​ జరుగుతుండగా బాద్​ షా ప్రమాదానికి గురయ్యారని సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని కథనాలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారట. దీంతో షారుక్​.. ప్రస్తుతం భారత్‌కు తిరిగి వచ్చారని.. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అంటున్నారు. మరి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.

Sharukh khana Jawaan movie : ఇకపోతే ప్రస్తుతం షారుక్‌.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'జవాన్‌'లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో షారుక్‌ సరసన నయనతార నటిస్తోంది. ఇంకా మూవీలో విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ రోల్​లో కనిపించనుంది. సంజయ్​ దత్​ విలన్​ రోల్​ పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట. ఇక ఈ ప్రాజెక్ట్​తో పాటు బాద్​ షా.. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో డిఫరెంట్​ కాన్సెప్ట్​లో రానున్న 'డంకీ' లోనూ నటిస్తున్నారు. ఇందులో తాప్సీ హీరోయిన్​. మరి ఈ రెండు చిత్రాల్లో.. ఏ షూటింగ్​లో ఆయన గాయపడ్డారు క్లారిటీ లేదు.

ఇకపోతే 2018లో 'జీరో' సినిమాతో డీలా పడిన షారుక్​ ఖాన్ ఆ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్ ' సినిమా గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకుని బాలీవుడ్​కు ఊపిరిపోసింది. ఇందులో భారీ స్థాయిలో ఉన్న యాక్షన్​ సన్నివేశాలను సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. అలా ఈ చిత్రం ఇచ్చిన జోష్​తో ఇప్పుడు జవాన్, డంకీలో నటిస్తున్నారు. ఇవి కూడా భారీ హిట్​ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతందో..

Last Updated : Jul 4, 2023, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details