దీపికా పదుకొణె, షారుక్‌ఖాన్‌లది హిట్ కాంబినేషన్. ప్రస్తుతం ఈ కలయికలో 'పఠాన్' చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి షారుక్ చిత్రంలో దీపిక ఆడిపాడనుందని సమాచారం. అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇందులో అతిథి పాత్రలో దీపిక సందడి చేయనుందట. ఆమె సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని, ఒప్పందం జరగాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది.
రణ్‌బీర్ భావోద్వేగం: త్వరలోనే 'షంషేరా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌కపూర్. జులై 22న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలోనే తన తండ్రి రిషి కపూర్‌ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు రణ్‌బీర్. ఈ సినిమా చూడటానికి ఆయన బతికి ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడనని అన్నారు.