బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ 'పఠాన్'తో నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి ఓ సాలిడ్ హిట్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసలు వర్షం కురిపించి రికార్డుకెక్కింది. అలా వంద కోట్ల నుంచి ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. ఇక షారుక్ కెరీర్లో అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.
అయితే ఇటీవలే షారుక్ రూ.10 కోట్లు విలువ చేసే ఓ కారు కొన్నారట. అదే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ కారు. ఇక ఈ కారు రాకతో ఇప్పటివరకు ఉన్న తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లోకి మరోకటి యాడ్ అయ్యింది. ఈ కొత్త కారును చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కారుకు సంబంధించి ఫొటోలతో పాటు కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట హలచల్ చేస్తున్నాయి. ఇక షారుక్ లగ్జరీ కార్ల కలెక్షన్లో బీఎండబ్ల్యూ, బెంట్లీ, బుగాటీతో పాటు మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి.
ఇక 'పఠాన్'సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. 'జీరో' మూవీ తరువాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ హీరో 'పఠాన్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శక్వంలో వస్తున్న 'జవాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
'పఠాన్' తర్వాత షారుక్ నటిస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకున్నారు అభిమానులు. అంతే కాకుండా 'త్రీ ఇడియట్స్' ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డంకీ' అనే సినిమాకు కూడా సైన్ చేశారు షారుక్. ఇక ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'టైగర్3' లోనూ గెస్ట్ రోల్లో కనిపించనున్నారట.
ఇటీవలే షారుక్ ఖాన్ 'పఠాన్'లోనూ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి కనువిందు చేశారు. అయితే అప్పట్లో షారుక్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలోనూ సల్మాన్ గెస్ట్ రోల్లో మెరిశారు. దీంతో ఇప్పుడు సల్మాన్ సినిమాలో షారుక్ ఎంట్రీ ఎలా ఉండనుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.