Shah Rukh Khan About Dunki :బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్- రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో తెరకెక్కిన 'డంకీ' మిక్స్డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. అయితే గతంలో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కించిన 'పీకే' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో 'పీకే' పదం ఓ బ్రాండ్‌గా మారింది. తాజాగా 'డంకీ' కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అంతా భావించారు.కానీ, అలా జరగలేదు. ఈ విషయంపై షారుక్ రీసెంట్గా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?
'ఈ సినిమా ప్రారంభించే సమయానికి నాకు 'డంకీ' గురించి అంతగా తెలియదు. కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. డైరెక్టర్ రాజు సర్, నేను కలిసి పని చేయాలనుకున్నాం. అయితే కథను సరిగ్గా వివరించలేకపోతే ఆయన అసలు ముందుకు రారు. ఇక ఈ మూవీకి డంకీ టైటిల్ సెట్ అవుతుందని భావించారు రాజ్ సర్. కానీ డంకీ టైటిల్ అర్థమేంటో ప్రజలకు నిజంగా తెలియదు. మేమూ ఆ విషయంపై ఫోకస్ చెయ్యలేదు. ఎందుకంటే పీకే సినిమా సమయంలో కూడా టైటిల్ మీనింగ్ ఎవరికీ తెలీదు. మూవీ రిలీజ్ అయ్యాకే అందరికి పీకే గురించి తెలిసింది' అని షారుక్ అన్నారు.
ఇదే సందర్భంలో డంకీ అర్థం తెలిపారు షారుక్. 'డంకీ అనేది ఓ చట్టవిరుద్ధమైన ప్రయాణం. దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు షారుక్ తెలిపారు. అంతే కాకుండా వాళ్లు దాన్ని డంకీ అంటారని అలా డంకీ రూట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది' అని ఆయన వివరించారు.