September Last Week Movie Release : టాలీవుడ్లో విజయ్ దేవరకొండ 'ఖుషి', నవీన్ పొలిశెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాల తర్వాత పెద్ద సినిమాలంటూ ఏవీ రిలీజ్ కాలేదు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' మూవీ పోస్ట్‌పోన్ వల్ల సెప్టెంబర్ లాస్ట్ వీకెండ్‌ను ఆయా సినిమాలు లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. టాలీవుడ్లో మూడు సినిమాలు భారీ అంచనాలతో విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏవంటే.
రామ్ పోతినేని స్కంద.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని-దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. 'అఖండ' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బోయపాటి నుంచి వస్తున్న సినిమా 'స్కంద' పై ఫ్యాన్స్ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు హీరో రామ్‌కు కూడా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 గురువారం రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
చంద్రముఖి-2..ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'చంద్రముఖి-2'. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి.. చివరకు సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ 'చంద్రముఖి' సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కథలో కొత్తదనం, ఊహించని రీతిలో సర్ప్రైజ్లు ఉంటాయని చిత్ర బృందం మొదట్నుంచి ప్రచారం చేస్తోంది. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ఒకేరోజు విడుదలౌతున్న రామ్ 'స్కంద', లారెన్స్ 'చంద్రముఖి-2' సినిమాలు ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయో లేదో చూడాలి.