September 28 Movie Release : రెబల్ స్టార్ ప్రభాస్-కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కితున్న చిత్రం 'సలార్ సీజ్ ఫైర్'. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తుందని.. గతంలో మూవీయూనిట్ ప్రకటించింది. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే చిత్రబృందం నుంచి.. వాయిదాకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ సినిమా పోస్ట్‌పోన్ దాదాపు ఖాయమైనట్లే అని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్లో కొన్ని సినిమాలు సెప్టెంబర్ 28 తేదీని లాక్ చేసుకుంటున్నాయి. అందులో కొన్ని ఇదివరకే రిలీజ్ డేట్ ప్రకటించగా.. తాజాగా ఈ తేదీలను రద్దు చేసుకుంటున్నాయి. మరి ఆ తేదీలో రానున్న సినిమాలేంటో చూద్దాం.
రూల్స్ రంజన్..కిరణ్ అబ్బవరం-నేహాశెట్టి జంటగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్'. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంది చిత్రబృందం. కానీ సలార్ పోస్ట్‌పోన్ వల్ల ఇప్పుడు సెప్టెంబర్ 28 న సినిమా ప్రేక్షకున ముందుకు రానున్నట్లు మూవీయునిట్ స్పష్టతనిచ్చింది.
స్కంద.. రామ్ పోతినేని-శ్రీలీల జంటగా నటించిన 'స్కంద'.. సెప్టెంబర్ 15న రానున్నట్లు మూవీయూనిట్ ఇదివరకే ప్రకటించింది. కానీ సలార్ వాయిదాను దృష్టిలో ఉంచుకొని స్కంద రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 28కి మార్చారు.