తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర - Pavitra lokesh

Senior Actor Naresh Pavitra lokesh Marriage: సీనియర్ నటి పవిత్రా లోకేష్​.. సైబర్​ పోలీసులను ఆశ్రయించారు. కొందరు సోషల్​మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Senior Actress Pavitra Lokesh
పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర

By

Published : Jun 30, 2022, 2:11 PM IST

Updated : Jun 30, 2022, 3:23 PM IST

Senior Actor Naresh Pavitra lokesh Marriage: కర్ణాటక మైసూర్​లోని సైబర్​ పోలీసులను ఆశ్రయించారు సీనియర్ నటి పవిత్రా లోకేశ్. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో ఫేక్​ అకౌంట్స్​ను క్రియేట్​ చేసి, అసభ్యకరమైన పోస్ట్​లు పెడుతున్నారని గుర్తుతెలియని వ్యక్తులపై ఇటీవలే ఫిర్యాదు చేశారు. లేనిపోని పుకార్లు పుట్టించి తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని వాపోయారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

దక్షిణాదిలో సహాయక పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. పలు వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవలే వార్తల్లో నిలుస్తూ వచ్చారు. 2007లో కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్​ను వివాహం చేసుకున్న ఆమె.. ప్రముఖ తెలుగు నటుడు నరేశ్​తో ప్రస్తుతం రిలేషన్​షిప్​లో ఉన్నట్లు కొద్దిరోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట నరేశ్​ ఫ్యామిలీ ఫంక్షన్​లో సందడి చేసిన ఆమె.. ఇటీవలే ఆయనతో కలిసి మహాబలేశ్వర ఆలయానికి కూడా వెళ్లారు.

అయితే పవిత్రా లోకేశ్​ను నరేశ్ పెళ్లిచేసుకోబోతున్నారనే పుకార్లను ఆయన పీఆర్ టీమ్​ కొట్టిపారేసింది. ఇక, ప్రసాద్​తో కొన్నాళ్లుగా పవిత్ర దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రముఖ కన్నడ నటుడు మైసూర్ లోకేశ్ కుమార్తెనే పవిత్ర. కన్నడ సినిమా 'మిస్టర్​ అభిషేక్'​తో 1995లో తెరంగేట్రం చేసిందామె. ఆమె సోదరుడు ఆది కూడా కన్నడనాట నటుడే.

ఇదీ చూడండి: ఆ​ నటితో నాలుగో పెళ్లి!.. నరేశ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Last Updated : Jun 30, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details