సమంత-నాగచైతన్య విడాకులపై తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. చైతన్య-సామ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు. అలాంటి వాళ్లిద్దరూ విడిపోవడం తనని షాక్‌కు గురి చేసిందని ఓ యూట్యూబ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పలువురు హీరోలపై స్పందించాలని ఇంటర్వ్యూలో కోరగా.. వారి గురించి ప్రస్తావిస్తూనే నాగ చైతన్య గురించి తనకు తెలిసిన విషయాలను వెల్లడించారు.
''హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మాకు అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్స్ భవనంపైన మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా మూడు ఇళ్లను నిర్మించుకున్నాం. అందులో ఒకటి నాది, మరొకటి నా సోదరుడిది, మూడోది నా కుమారుడిది. ఓసారి చైతన్య మా అపార్ట్‌మెంట్స్ చూడటానికి వచ్చారు. ఆ సమయంలో మా ఇళ్లనూ చూశారు. ఆయనకు అవి బాగా నచ్చేశాయి. ఆ మూడింటిలో ఒకటి తనకి కావాలని కోరారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఆ ఇళ్లను మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్నానని చెప్పా. నా మాటతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే విషయంపై కొన్నిరోజుల తర్వాత నాగార్జున నన్ను సంప్రదించగా.. ఆయన మాట కాదనలేక.. ఆ మూడు ఇళ్లలో ఒకదాన్ని చైతన్యకు ఇచ్చేశా''