ప్రముఖ నటుడు కృష్ణంరాజు వెండితెర మీద రెబల్ స్టార్ అయితే.. తెర వెనుక మర్యాద రామన్నలా ఉంటారని సినీ పరిశ్రమలో ఉన్న టాక్. సినీ రంగంలో, రాజకీయాలలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. దాదాపు 60 ఏళ్లకుపైగా ఆయన సినీ జీవితం కొనసాగింది. సంపన్న కుటుంబంలో జన్మించడం వల్ల వారసత్వంగా ఆయనకు కొంత ఆస్తి ఉంది. కానీ ఇన్నాళ్లు సినిమాల్లో కూడా కొంత సంపాదించారు. తాజాగా కృష్ణంరాజు మరణించడం కారణంగా.. ఆయన ఆస్తి గురించిన విషయంపై చర్చ మొదలైంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, మరికొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇవీ ఆయన ఆస్తులు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగళ్తూరులో ఓ సంపన్నుల కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. తల్లిదండ్రుల వారసత్వంగా సొంతూరిలో వందల ఎకరాల భూమి వచ్చిందట. ప్రస్తుతం దాని నిర్వహణంతా కృష్ణంరాజు బంధువులే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓ భవనంతో పాటు చెన్నై, హైదరాబాద్లో కృష్ణంరాజుకు నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్లో కృష్ణంరాజుకు ఫామ్ హౌస్ కూడా ఉందట.