డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు. అయితే ఈ సందర్భంగా విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'లైగర్' సినిమా షూటింగ్ తన తల్లి భయపడినట్లు చెప్పుకొచ్చారు.
లెజండరీ బాక్సర్ మైక్ టైసన్.. లైగర్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్-విజయ్ మధ్య సీన్స్ షూటింగ్ కోసం యూనిట్ అంతా అమెరికాకు వెళ్లింది. అయితే టైసన్‌తో షూటింగ్ అని తెలిసి.. తన తల్లి ఆందోళన చెందినట్లు విజయ్ చెప్పాడు.
'టైసన్ నన్ను గాయపర్చొచ్చు. నా ఎముకలు విరగ్గొడతారని మా అమ్మ చాలా భయపడింది. నాకు ఏమీ కావద్దని చాలా ప్రార్థనలు చేసింది. నేను బాగుండాలని నా నుదుటిపై విభూతి కూడా పెట్టింది. అయితే అలాంటిదేం జరగలేదు. షూటింగ్ కూల్‌గా జరిగిపోయింది. అందుకే ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా' అని ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయ్ పేర్కొన్నాడు.
లైగర్ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కూడా.. విజయ్ తల్లి భయపడిన విషయాన్ని గుర్తు చేశారు.