Satyadev Krishnamma Movie Trailer Released: నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ'. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ గురువారం విడుదల చేశారు. సత్యదేవ్ సరసన హీరోయిన్ అతిరా రాజ్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమాని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.
Bimbisara Vijayaho Song: హీరో నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 'బింబిసార'. వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలను పంచుకోగా ఇప్పుడు మరో పాటను విడుదల చేసింది. సంగీత దర్శకుడు కీరవాణి, చైతన్య ప్రసాద్ రాసిన పవర్ఫుల్ 'విజయహో' సాంగ్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.