యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవలే తన స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్‌ను హీరోగా, ఆయన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్గా పెట్టి ఒక సినిమాను ప్రారంభించారు. అయితే అర్జున్-విశ్వక్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇప్పుడు విశ్వక్ స్థానంలో మరో హీరోను వెతుకుతున్నారట అర్జున్.
విశ్వక్ స్థానంలో ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న యాక్షన్ కింగ్ - విశ్వక్ సేన్ అర్జున్ వివాదం
విశ్వక్సేన్తో వివాదం తర్వాత తన సినిమా కోసం మరో హీరోను వెతికే పనిలో పడ్డారట యాక్షన్ కింగ్ అర్జున్. ప్రస్తుతం ఆయన మరో కథానాయకుడి పేరును పరిశీలించారని, ఆయన్ను సంప్రదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎవరంటే?
ప్రముఖ హీరో శర్వానంద్‌ను ఈ సినిమా కోసం సంప్రదిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారట అర్జున్. ఈ కథకి శర్వానంద్ అయితే న్యాయం చేయగలడని.. అతని డేట్స్ ఎలా అయినా సంపాదించాలని అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. శర్వ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. దీని తర్వాత కూడా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో మరో మూవీకీ ఆయన కమిట్ అయ్యారంట. ఇలా వరుసగా రెండు సినిమాలు కమిటైన శర్వానంద్ ఇప్పుడు అర్జున్ కోసం డేట్స్ కేటాయిస్తారా అనేది సందేహంగా మారింది.
ఇదీ చూడండి:బర్త్‌డే ముందు వర్షకు అదిరిపోయే సర్ప్రైజ్.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మూ!