తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గాడ్​ఫాదర్​'లో చిరు తండ్రిని మీరు గుర్తుపట్టారా? - సర్వాదామన్​ బెనర్జీ చిరంజీవి తండ్రి

'గాడ్​ఫాదర్'​ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటించిన యాక్టర్​ను మీరు గుర్తుపట్టారా? ఆయన 1986లో తెరకెక్కిన ఆల్​ టైమ్​ క్లాసిక్​ మూవీలో హీరోగా నటించారు. సుమారు 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

sarvadaman benarjee reentry to telugu after 35 years with god father
sarvadaman benarjee reentry to telugu after 35 years with god father

By

Published : Oct 7, 2022, 10:32 AM IST

Updated : Oct 7, 2022, 10:43 AM IST

Godfather Sarwadhaman Benarjee: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్​ఫాదర్' మూవీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళ సూపర్​హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్​గా వచ్చిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, ప్రత్యేక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించారు. అయితే చిరంజీవి, నయనతారల తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా నటించిన నటుడిని మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు. ఆయనే సర్వదామన్ బెనర్జీ. చేసింది కొద్ది సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

1986లో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో చిరంజీవితో పాటు సర్వదామన్​ బెనర్జీ ​ హీరోగా నటించారు. అదిరిపోయే పాటలతో 'సిరివెన్నెల' సినిమా తెలుగు ఆల్​టైమ్​ క్లాసిక్​ల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే సీతారామ శాస్త్రి.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. తెలుగు భాష రాకపోయినా సినిమాలో అంధుడిలా సర్వదామన్​ బెనర్జీ అద్భుతంగా నటించారు.

ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన ఆయన.. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సంవత్సరాలు గడిపారు. 35 ఏళ్ల తర్వాత 'గాడ్​ఫాదర్'​లో చిరంజీవికి తండ్రిగా రీఎంట్రీ ఇచ్చారు. ఏదేమైనా జనరేషన్​లు మారిపోవడంతో 35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సర్వదామన్ బెనర్జీని తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేదని సోషల్​మీడియాలో ఎక్కడా ఆయన ప్రస్తావన కనిపించకపోవడం బట్టి తెలుస్తోంది. మరి మీరైనా ఆయనను గుర్తుపట్టారా?

చిరంజీవి, సర్వదామన్​ బెనర్జీ

ఇవీ చదవండి:'అందరూ నా వయసెంత అని అడుగుతున్నారు.. చెబితే పెళ్లి కోసం..'

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

Last Updated : Oct 7, 2022, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details