తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​-కీర్తి మాస్​ డ్యాన్స్​.. లవ్​మూడ్​లో నాని-నజ్రియా - nani Antey Sundaraniki romantic song released

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాని 'అంటే సుందరానికి', మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' సంగతులు​ ఉన్నాయి. ఆ వివరాలు..

Sarkaru vaaripata mass song
సర్కారు వారి పాట అంటే సుందరానికి అప్డేట్స్​

By

Published : May 6, 2022, 12:10 PM IST

Nani Antey Sundaraniki Melody song: నేచురల్​ స్టార్​ హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఇందులో సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు.​ తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని 'ఎంత చిత్రం' సాంగ్​ను మే 9న ఉదయం 11.07గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్​. దీంతో పాటే ఓ హీరోహీరోయిన్లకు సంబంధించిన కొత్త​ పోస్టర్​ను కూడా​ విడుదల చేశారు. ఈ పోస్టర్​ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. దీని చూస్తుంటే మెలోడి లవ్ సాంగ్​ రాబోతున్నట్లు​ అర్థమవుతోంది. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 జూన్​ 10న ఈ సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Sarkaru vaaripata mass song: సూపర్​ స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' మాస్ సాంగ్ సిద్ధమైపోయింది. మాస్ మసాలాతో అందరినీ ఉర్రూతలూగించేందుకు 'మ..మ..మహేశా..' అంటూ మహేశ్​ స్పీడ్​గా దూసుకొచ్చేస్తున్నారు. మార్చి 7న ఈ పాటను రిలీజ్​ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను కూడా మూవీ టీమ్​ విడుదల చేసింది. ఈ సీజన్​లోనే అత్యంత మాస్ సాంగ్ 'మ..మ..మహేశ్' అని క్యాప్షన్​ జోడించింది. ఇందులో మహేశ్, కీర్తి స్టెప్పులేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మించింది. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి:ఘనంగా ఏఆర్‌ రెహ్మాన్​ కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details