Sarkaru Vari Paata New Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమాకు మరో సెన్సేషన్ యాడ్ అవుతున్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెలబ్రేషన్స్ మళ్లీ మొదలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో మరో సాంగ్‌ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్రఖని, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక, ఈ సినిమాను అమెజాన్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 24నుంచి స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం.
Vijay Antony Jwala Movie Trailer: 'బిచ్చగాడు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సినిమా 'జ్వాల'. నవీన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమ్మ క్రియేషన్స్ పతాకంపై రానుంది. ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు రానా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను రష్యా, స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విజయ్ సరసన అక్షరహాసన్ నటిస్తోంది. విజయ్ ఆంటోనితో పాటు అరుణ్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
AkshayKumar Pridhviraj: అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'పృథ్వీరాజ్'. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రానున్న పీరియాడికల్ డ్రామాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా మిస్ యూనివర్స్- 2017 విజేత మానుషి చిల్లర్ నటిస్తున్నారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పేరును మారుస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'పృథ్వీరాజ్' సినిమా పేరును 'సామ్రాట్ పృథ్వీరాజ్' గా మారుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళభాషల్లో విడుదల కానుంది. సంజయ్‌దత్, సోనూసూద్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.