తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్​ ఈవెంట్..​ ఉత్కంఠగా 'శేఖర్​' ట్రైలర్ - Rajashekar shekar movie director

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్​, రాజశేఖర్​ 'శేఖర్'​ ట్రైలర్​ వివరాలు ఉన్నాయి.

sarkaru vaari paata pre release event and shekar trailer
శేఖర్ ట్రైలర్​, సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్

By

Published : May 5, 2022, 11:57 AM IST

Sarkaru vaari pata Pre release event: సుపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మే 2న ట్రైలర్​ విడుదల చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్​ చేసింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్​లోని యూసఫ్​గూడ పోలీస్​ గ్రౌండ్స్​లో నిర్వహిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పింది. అయితే చీఫ్​ గెస్ట్​గా ఎవరు రాబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​లో మహేశ్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్​లో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పరశురామ్‌ తెరకెక్కించగా.. కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా నటించింది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

Shekar movie trailer: యాంగ్రీ యంగ్​మ్యాన్ రాజశేఖర్‌ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్‌'. బొగ్గరం వెంకట శ్రీనివాస్‌, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. మే 20న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్​ లాంఛ్​ ఈవెంట్​ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీటీమ్​. యాక్సిడెంట్​గా చిత్రీకరించిన ఓ మర్డర్​ కేసును ఛేదించే రిటైర్డ్​ ఆఫీసర్​గా రాజశేఖర్​ కనిపించారు. వయసు పైబడిన వ్యక్తిగా రాజశేఖర్​ కొత్త లుక్స్​ బాగున్నాయి. "పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకొని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలామంది ఉంటారు. అదే, పోలీస్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే ఉంటారు" అంటూ సమీర్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రకాశ్​రాజ్​, రాజశేఖర్​ కూతురు శివాని శివాత్మిక ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్‌'కు రీమేక్‌గా రూపొందిందీ చిత్రం. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చారు. ఎన్‌.మల్లిఖార్జున్‌ ఛాయాగ్రహణం అందించారు.

ఇదీ చూడండి: గోవాలో శ్రియ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోందిగా!

ABOUT THE AUTHOR

...view details