Sarkaru vaari paata update: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేశ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కుమార్తె సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో సినిమా తర్వాతి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
చిత్ర నిర్మాతలు కొత్త అప్డేట్ ఇచ్చారు. మోత మోగిపోవాలా అంటూ శనివారం 11.07 గంటలకు చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు సినీ వర్గాల టాక్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
AlluArjun Comments On KGF 2 Movie: కన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్-2' సినిమా.. భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖలంతా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'కేజీఎఫ్-2 సినిమా యూనిట్‌కు అభినందనలు. ఈ సినిమాలో యశ్ నటన అద్భుతం. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి పాత్రలు అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ నా అభినందనలు' అని ట్వీట్ చేశారు అల్లుఅర్జున్.