Sarkaru Vaari Paata Runtime: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న 'సర్కారువారి పాట' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించిన ఆసక్తికర విషయం చెప్పారు మేకర్స్. సినిమా రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. తమన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మదర్స్ డే గిఫ్ట్: ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'కేజీయఫ్ 2' చిత్రం నుంచి మదర్స్ డే సందర్భంగా 'యదగరా యదగరా' అంటూ సాగే పూర్తి వీడియో సాంగ్ విడుదలైంది. 'కేజీయఫ్' రెండు భాగాల్లోనూ భారీ పోరాటాలు సహా అమ్మ సెంటిమెంటే ప్రధాన బలం. యశ్ నటించిన 'రాకీ' పాత్ర ప్రయాణానికి అమ్మే స్ఫూర్తి. ఏప్రిల్ 14న విడుదలైన రెండో భాగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు అందుకోగా, ఇటీవలే కేవలం హిందీ వెర్షన్లో రూ.400 కోట్లు రాబట్టింది.