తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అయ్యో పాపం.. కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎత్తుకెళ్లారట! - సర్కారు వారి పాట కీర్తి

మహేశ్ బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో అంచనాలు పెంచుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ ఆసక్తికర విషయం చెప్పింది!

KEERTI SURESH
KEERTI SURESH

By

Published : May 3, 2022, 3:49 PM IST

sarkaru vaari paata movie: పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. సోమవారం విడుదలైన ఈ ట్రైలర్ రికార్డులు బద్దలు కొడుతోంది. 24 గంటల వ్యవధిలో తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా ట్రైలర్​గా నిలిచింది. యూట్యూబ్​లో నెం.1 స్థానంలో ట్రెండ్​ అవుతోంది. ఈ ట్రైలర్​లో మహేశ్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. సినిమా దర్శకుడు పరశురాం, హీరోయిన్ కీర్తి సురేశ్.. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇది మహేశ్ కోసమే సిద్ధం చేసిన సినిమా అని పరశురాం చెప్పుకొచ్చారు. పోకిరి, దూకుడు చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మహేశ్​కు ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కీర్తి సురేశ్, పరశురామ్ ఇంటర్వ్యూ

ఈ సందర్భంగా పరశురాం, కీర్తి సురేశ్.. స్పెయిన్​లో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చారు. బార్సిలోనాలో షూటింగ్ జరుగుతుండగా దొంగలు రెచ్చిపోయారని కీర్తి చెప్పారు. ఆ నగరంలో దొంగల బెడద ఎక్కువ అని వివరించారు. 'కీర్తి సురేశ్ ధరించాల్సిన కాస్ట్యూమ్స్​ను ఓ వ్యానులో ఉంచాం. తర్వాత ట్రయల్స్ చేసుకోవచ్చని వ్యానులో భద్రపరిచాం. కానీ దొంగలు వ్యానును బద్దలుకొట్టి.. కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారు' అని డైరెక్టర్ పరశురాం చెప్పుకొచ్చారు.

ఇక, సర్కారు వారి పాట సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా ట్రైలర్​తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చిత్ర బృందం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్​లోని యూసఫ్​గూడ పోలీస్​ గ్రౌండ్స్​లో ఈ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. చీఫ్​ గెస్ట్​గా ఎవరు రాబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి:'సర్కారు వారి పాట' ట్రైలర్​ రికార్డు.. ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ప్లాన్​!

ఇది మా 'గీతగోవిందం'.. డైరెక్టర్​ పరశురామ్ 'లవ్'​స్టోరీ

ABOUT THE AUTHOR

...view details