సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారువారి పాట' భారీగా వసూళ్లను రాబడుతోంది. కేవలం 12రోజుల్లోనే.. రూ. 200కోట్లు వసూలైనట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. సినిమా భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన అదే జోరును ఇంకా కొనసాగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.3 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.156.9కోట్ల గ్రాస్.. రూ.100.01కోట్ల షేర్‌ను రాబట్టింది ఈ సినిమా. అలాగే అన్ని ఏరియాలు మొత్త కలిపితే.. 122.09 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ వసూలైంది.
సర్కారువారి పాట.. 12 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు - 'మేజర్' సాంగ్ రిలీజ్ - major movie update
మహేశ్‌బాబు హీరోగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం 12రోజుల్లోనే రూ.200 కోట్లను రాబట్టింది. అలాగే మేజర్ సినిమాలో 'హృదయమా' సాంగ్ అప్డేట్ మీకోసం..
Major movie: ప్రతి భారతీయుడ్ని భావోద్వేగానికి గురిచేసేలా రూపుదిద్దుకున్న చిత్రం 'మేజర్'. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 'హృదయమా' వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా సిద్ధమైంది. వాస్తవిక ఘటనలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శించనున్నారు. దిల్లీ, జయపుర, లఖ్‌నవూ, అహ్మదాబాద్, ముంబయి, పుణె, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ అలా దేశంలోని 9 నగరాల్లో.. ఎంపిక చేసిన థియేటర్లలోనే ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
ఇదీ చదవండి:బాలయ్య సినిమాలో యాక్షన్ కొత్త యాంగిల్లో..: అనిల్ రావిపూడి