Sarkaaru Vari Paata Trailer Release Date: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేశ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. 'కళావతి' పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కుమార్తె సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో సినిమా తర్వాత అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజాగా మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు. మే 2వ తేదీన సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు సినీ వర్గాల టాక్. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.