సినిమా.. క్రీడలకు ఎక్కడో అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. ఎంతో మంది క్రీడాకారులు.. హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు ప్రేమించుకుంటున్నారు. ఆ కాలంలో దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్‌తో మొదలైన ఈ పరంపరకు తాజాగా విరుష్క జంట జతయ్యింది. ప్రేమ బంధాలు ముడి పడడమే కాకుండా డేటింగ్ రూమర్స్లోనూ ఈ రెండు రంగాలు ఏకమవుతున్నాయి. ఓ వైపు క్రికెటర్ రిషబ్ పంత్.. హీరోయిన్ ఊర్వశీ రౌతెేలా డేటింగ్ వార్తలు వస్తుంటే మరో వైపు శుభ్‌మన్ గిల్.. సారా జంట కూడా లవ్‌లో పడ్డట్లు రూమర్లు వస్తున్నాయి.
కొంత కాలంగా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ డేటింగ్లో ఉందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. వీరిద్దరూ అనేక సార్లు కెమెరా కంట పడుతున్నారు. సారాతో కలిసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న ఫొటో ఒకటి ఇటీవల వైరలయ్యింది. కానీ వీరిద్దరూ ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మరోసారీ ఈ జంట కలిసి తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.