Sapta Sagaralu Dhaati Teaser :రీసెంట్గా కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ'.. తెలుగులోనూ విడుదలైన మంచి టాక్ అందుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. అందమైన జీవితాన్ని గడిపేందుకు చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్‌గా చూపించారు.
Sapta Sagaralu Dhaati Release Date :అయితే ఇప్పుడు 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ రిలీజ్ డేట్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
టీజర్ కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. మొదటి భాగంలోని సోల్ కూడా ఎక్కడా మిస్ కాకుండా ప్రచార చిత్రాన్ని కట్ చేశారు. ప్రస్తుతం అది ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోందని గుర్తుచేశారు. తొలి చిత్రంలోని టెంపోనూ ఇందులో కంటిన్యూ చేస్తూ.. హీరో తన ప్రియురాలు చెప్పే మాటలను ట్రాన్సిస్టర్‌లో వింటున్నట్లుగా మనసును తాకేలా చూపించారు. చరణ్ రాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అయితే ఈ సింగిల్ టీజర్లోనే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డైలాగ్స్ పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది.