Sapta Sagaralu Dhaati Side B Trailer :కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్-ఎ'. సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లింది. ఓటీటీలోనూ మంచి వ్యూవర్హిష్ సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా 'సప్తసాగరాలు దాటి సైడ్ బి' విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి వచ్చాక కూడా ప్రియ (రుక్మిణి వసంత్)ను మర్చిపోలేకపోతారు. కానీ కొద్ది కాలం తర్వాత మనుకు మరో అమ్మాయి (చైత్ర జే ఆచార్)కి పరిచయమవుతుంది. ఇక ఆమెకు దగ్గర అవుతున్న సమయంలో అనుకోకుండా ప్రియ కనిపిస్తుంది. ఆ తర్వాత మను తిరిగి ప్రియతో మాట్లాడటం, తనను అన్యాయంగా జైలులో వదిలేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటి అంశాలను ఈ తాజా ట్రైలర్‌లో చూపించారు. అయితే ఇందులో వయొలెన్స్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.
ఇక ఈ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 'జైలు నుంచి వచ్చిన కొత్తలో లైఫ్ కొన్నాళ్లు కష్టంగానే ఉంటుంది. ఏం బాధ పడకు. కొంచెం పెద్ద జైలుకి వచ్చాననుకో.' అనే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అయితే సైడ్ ఏ మొత్తం లవ్ స్టోరీ నేపథ్యంలో నడవగా... రెండో పార్ట్ మాత్రం రివెంజ్ ఎలిమెంట్స్‌తో కనిపించింది.