Sapta Sagaralu Dhaati Side B Movie: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' శుక్రవారం (నవంబర్ 17న) విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' తెలుగులో సెప్టెంబర్లో విడలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాలేదు. ఓటీటీలో విడదల చేశాకే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, పాత్రలు, వారి భావోద్వేగాలకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'ని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సారి ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని.. అలానే టికెట్ రేట్లు తగ్గించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
అయితే శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాకు తెలుగులో గట్టి పోటీ ఉంది. అదే రోజున హీరోయిన్ పాయల్, దర్శకుడు అజయ్ భూపతి 'మంగళవారం' సినిమా కూడా విడుదల కానుంది. దీంతో పాటు 'స్పార్క్', 'మై నేమ్ ఈజ్ శృతి' సినిమాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.