Sankranti Theatres Occupancy:తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం వల్ల రద్దీ పెరిగింది. ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ అంటూ గురువారం (జనవరి 11) రాత్రి నుంచే సినీలవర్స్ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. విజువల్ వండర్స్ 'హనుమాన్' సినిమాకు ఆన్లైన్లో సగటున గంటకు 16వేల టికెట్లు బుక్ అవుతున్నాయట.
అటు మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ డే కలెక్షన్లు అదరగొట్టేశాయని ఇన్ సైడ్ టాక్. ఇక శని, ఆదివారాల్లో 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు రానున్నాయి. పండగ సీజన్‌తో పలు ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడం వల్ల రానున్న 5-6 రోజులు థియేటర్లలో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు కావడం పక్కా.
మరోవైపు ఇదేరోజు బాలీవుడ్ మూవీ 'మెర్రీ క్రిస్మస్', తమిళ్ సినిమాలు 'అయలాన్', 'కెప్టెన్ మిల్లర్' రిలీజయ్యాయి. కానీ, వాటికి ఆయా రాష్ట్రాల్లో 'హనుమాన్', 'గుంటూరు కారం' స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్ రాలేదనే చెప్పాలి. దీంతో కంటెంట్ బాగుంటే ఒకే రోజు ఎన్ని సినిమాలు వచ్చినా, తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని అర్థమైపోతుంది.