Sankranti 2023 telugu movies : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది 'వీరసింహారెడ్డి'. మరోవైపు కమ్ బ్యాక్ తర్వాత ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవికి.. 'వాల్తేరు వీరయ్య'తో అది దక్కింది. అలా ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఒకరోజు గ్యాప్‌లో బరిలోకి దిగి మంచి హిట్లను అందుకున్నారు ఈ స్టార్ హీరోలు. అయితే ఇదంతా జరిగి దాదాపు ఐదు నెలలు దాటేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు అగ్రహీరోలు తమ కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి కూడా పెట్టేశారు. చిరు.. మెహర్ రమేశ్‌తో 'భోళాశంకర్', బాలకృష్ణ.. అనిల్ రావిపూడితో 'NBK 108' చేస్తున్నారు. మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లో కోసం చర్చలు జరపుతున్నారు.
అయితే సంక్రాంతి 'వీర' డైరెక్టర్లు.. గోపీచంద్ మలినేని, బాబీ మాత్రం ఇంకా తమ కొత్త ప్రాజెక్ట్‌ల గురించి అనౌన్స్ చెయ్యలేదు. టాప్ హీరోలతోనే వర్క్ చేయాలని భావించి కథలు రాసుకుని.. అప్పటినుంచి వారితోనే డిస్కషన్స్ జరుపుతూ వస్తున్నారు. కానీ బడా హీరోలందరు మాత్రం పలు ప్రాజెక్ట్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉండటంతో.. ఈ ఇద్దరు దర్శకులు వారి తదుపరి ప్రాజెక్ట్‌లను డిలే చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరి ప్రాజెక్ట్‌లు ఖాయమైనట్లు తెలిసింది. వారు చేయబోయే సినిమాలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది.
Director Bobby upcoming movie : అదేంటంటే.. దర్శకుడు బాబీ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కథ చెప్పి ఒప్పించారట. అయితే ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీకాంత్.. ఆ తర్వాత తన మిగిలిన ప్రాజెక్ట్స్‌తో పాటు బాబీ సినిమాను పట్టాలెక్కిస్తారట. ఇదంతా జరిగే సరికి కాస్త ఆలస్యం అవ్వనుంది. అందుకే ఇదంతా జరిగేలోపు డైరెక్టర్ బాబీ.. మరో కథ సిద్ధం చేసి నందమూరి బాలకృష్ణతో(director bobby balakrishna movie) ఓ మూవీ చేసేందుకు సైన్ చేశారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుందట.