తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sankranthi movies: చిరు X​ బాలయ్య.. విజయ్​ X​ అజిత్​.. ఫస్ట్​ వచ్చేది ఎవరంటే? - Sankranthi vijay varisu

సంక్రాంతి 2023 బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, విజయ్‌, అజిత్‌ పోటీ పడనున్నారు. మరి ముందు ఎవరి చిత్రం రిలీజ్​ కానుంది? ఆ తర్వాత ఎవరివి వస్తున్నాయి? తెలుసుకుందాం..

Sankranthi movies 2023
చిరు వర్సెస్​ బాలయ్య.. విజయ్​ వర్సెస్​ అజిత్​.. ముందు ఎవరంటే?

By

Published : Jan 4, 2023, 9:40 PM IST

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, కోలీవుడ్‌ స్టార్​ హీరోలు విజయ్‌, అజిత్‌ల చిత్రాలు విడుదలవుతున్నాయనే సంగతి తెలిసిందే. మూడు సినిమాల విడుదల తేదీ ఇప్పటికే ఖరారు కాగా అజిత్‌ చిత్ర విడుదల తేదీ కూడా ఖరారు అయిపోయింది. ముందుగా అజిత్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఏ హీరో సినిమా ఏ రోజు థియేటర్లలోకి వస్తుందంటే..?

  • అజిత్‌- దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం 'తునివు' (తెలుగులో తెగింపు). ఈ సినిమాని జనవరి 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది
  • బాలకృష్ణ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్‌ రూపొందించిన సినిమా 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌. ఈ చిత్రం జనవరి 12న రాబోతుంది.
  • విజయ్‌- వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వారిసు' (తెలుగులో వారసుడు). రష్మిక కథానాయిక. ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది.
  • చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ కథానాయిక. ఈ సినిమా జనవరి 13న విడుదలకానుంది.

ఇవీ వస్తున్నాయి..ఈ అగ్ర హీరోల చిత్రాలతోపాటు రెండు చిన్న సినిమాలు సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా తెరకెక్కిన 'విద్య వాసుల అహం', సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన 'కల్యాణం కమనీయం' జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదీ చూడండి:బాలయ్యకు ట్విస్ట్​ ఇచ్చిన ప్రభాస్​.. ఇంట్రెస్టింట్​గా అన్​స్టాపబుల్​ ప్రోమో

ABOUT THE AUTHOR

...view details