పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే దర్శకుడు మారుతితో ఓ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్‌కు తాతగా నటించబోతున్నారట. ఆయన త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొననున్నారు.
ప్రభాస్, మారుతి సినిమాలో సంజయ్ దత్.. ఏ పాత్ర చేయబోతున్నాడో తెలుసా? - సంజయ్ దత్ ప్రభాస్ సినిమా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలక రోల్ చేయబోతున్నారు. ఆ ప్రత్యేకమైన పాత్ర ఏంటో తెలుసా..
కాగా, ఈ సినిమాను మారుతి హారర్ కామెడీగా రూపొందిస్తున్నాడు. అందులో భాగంగానే.. ఓ కీలక రోల్ కోసం మేకర్స్ సంజయ్ దత్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ దత్ అనగానే అందరూ విలన్ రోల్ అయ్యింటుందని అనుకుంటారు. కానీ ఇందులో ప్రభాస్‌కు తాతగా సంజయ్ నటిస్తుడంటం గమనార్హం. అయితే ఈ పాత్రకు కూడా ఏదో స్పెషాలిటీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది.
మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నా.. అందులో కామెడీ కచ్చితంగా ఉంటుంది. ఇకపోతే సంజయ్ దత్ కూడా హిందీలో మున్నాభాయ్ సినిమాలతో కామెడీ ఇరగదీశాడు. దీంతో వీరిద్దరూ కలిస్తే కామెడీ కుమ్మేస్తారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సీరియస్ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్‌కు సైతం ఈ సినిమా రిలీఫ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తర్వాత పలు భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారని సమాచారం.