మాస్టర్ చిత్రంతో తమిళ స్టార్ హీరో విజయ్ - దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబో కోలీవుడ్, టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో దళపతి 67 రూపొందనుంది. అయితే దానిపై నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో సోమవారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సంజయ్ దత్ నటిస్తారనే వార్త కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటే ఇతర నటీనటుల వివరాలను తెలియజేసింది. హీరోయిన్గా త్రిష నటించనుంది. యాక్షన్ హీరో అర్జున్ మరో కీలక పాత్ర పోషించనున్నారు. ఇంకా మిస్కిన్, జీవీఎమ్, ప్రియా ఆనంద్ తదితురులు నటించనున్నారు.
'దళపతి 67'లో కేజీయఫ్ విలన్.. హీరోయిన్గా త్రిష ఫిక్స్ - లోకేష్ కనగరాజ్ విజయ్ దళపతి
లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబోలో రూపొందుతన్న దళపతి 67లో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించనున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష, మరో కీలక పాత్రలో అర్జున్ నటించనున్నట్లు వెల్లడించారు మేకర్స్.
ఇకపోతే 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' తర్వాత విజయ్- సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లో కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, యాక్షన్: అన్బరివ్, ఎడిటింగ్: ఫిలోమిన్‌రాజ్, కొరియోగ్రఫీ: దినేశ్, సంభాషణలు: లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, దీరజ్ వైదీ. కాగా, కమల్‌హాసన్ హీరోగా గతేడాది తాను తెరకెక్కించిన విక్రమ్‌తో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అందులో భాగం చేస్తారా, లేదా? వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి:వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ.. వధువు ఎవరంటే?