Samyuktha Menon: 'భీమ్లానాయక్'తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ నటి సంయుక్తా మేనన్. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆమె కథానాయికగా నటించిన 'బింబిసార' చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా తాజాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
మీ ఫోన్ వాల్ పిక్ ఏమిటి?
సంయుక్తా మేనన్: ఇదే నా వాల్ పిక్.. నాకెంతో ఇష్టమైన 'నోవా'ని మీ అందరికీ పరిచయం చేస్తున్నా.
ధనుష్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
సంయుక్తా మేనన్:క్లాస్, మంచి వ్యక్తిత్వం గల మనిషి.
'సార్' రిలీజ్ ఎప్పుడు?
సంయుక్తా మేనన్:సార్.. తుఫాన్ త్వరలోనే మీ ముందుకు రానుంది. మీ అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నా.
ఈ ఫొటోలో మీరు తారక్‌తో ఏం చెబుతున్నారు?
సంయుక్తా మేనన్: ఆయన నటనా ప్రావీణ్యం గురించి మాట్లాడుతున్నా..! మరి, ఒకవేళ తారక్ మీ ముందుంటే మొదట మీరేం మాట్లాడతారు?
ఇంత తక్కువ సమయంలో తెలుగు ఎలా నేర్చుకోగలిగారు? 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరు చక్కగా మాట్లాడారు..!
సంయుక్తా మేనన్: హైదరాబాద్ నీకు రెండో నివాసమైనప్పుడు ఇక్కడి భాషను నువ్వు త్వరగా నేర్చుకోలేవా? లాక్‌డౌన్ సమయంలో జూమ్ క్లాసులు తీసుకొని మరీ నాకు తెలుగు నేర్పించిన ఆశా మేడమ్‌కు ధన్యవాదాలు.
మీ చిన్ననాటి ఫొటోని షేర్ చేయగలరు?