Sampoornesh Babu New Movie : హృదయకాలేయం, కొబ్బరిమట్ట సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబు తెరపై కనిపించి చాలా రోజులే అయింది. కెరీర్ ప్రారంభంలో స్ఫూఫ్ కామెడీ చిత్రాలతో కమర్షియల్‌గా మంచి సక్సెస్‌లను అందుకున్న ఆయన.. ఆ తర్వాత పేసరట్టు, సింగం 123, కొబ్బరి మట్ట, క్యాలి ఫ్లవర్.. ఇంకా ఎన్నో చిత్రాలను చేశారు. కానీ మంచి హిట్ అందుకోలేకపోయారు.
ఇప్పుడు చాలా విరామం తర్వాత ఓ పొలిటికల్ కామెడీ సినిమాతో సంపూర్ణేశ్ బాబు రానున్నారు. ఈ చిత్రానికి మార్టిన్ లూథర్ కింగ్(Martin Luther King) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది మూవీ టీమ్. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వేదికగా రిలీజ్ చేసింది. ఇందులో సంపూర్ణేశ్ బాబు తలపై ఓ భారీ కిరీటం పెట్టుకుని కనిపించారు. అయితే ఆ కిరీటంలో కొంతమంది నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నట్లుగా కనిపంచారు. డిఫరెంట్‌గా డిజైన చేసిన ఈ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబుతో పాటు దర్శకుడు వెంకటేష్ మహా, నరేశ్ కూడా కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ పోస్టర్ ద్వారా తెలిపింది.