'నరసింహుడు'తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముంబయి భామ సమీరారెడ్డి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. గతంలో తాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే అందులో సరిగా చేయలేక ఆరోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపింది.
"నా మొట్టమొదటి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా మహేశ్‌బాబు సినిమా కోసం. ఆరోజు నాకెంతో భయం వేసింది. వాళ్లు ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటివరకూ ఏదైతే డెస్క్ జాబ్ చేశానో మళ్లీ అదే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ధైర్యం కూడగట్టుకుని మొదటిసారి ప్రైవేటు ఆల్బమ్ కోసం కెమెరా ముందుకు వచ్చాను" అని సమీరా రెడ్డి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.