స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. హరి - హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రముఖ కథానాయకులతో ట్రైలర్‌ను విడుదల చేయించింది చిత్ర బృందం. తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేసి, సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.
గర్భవతిగా సమంత పోరాటం.. ఈ వీడియో చూశారా? - యశోద్ ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె గర్భవతిగా కనిపిస్తోంది!
యశోద ట్రైలర్ రిలీజ్
'నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా' అని సమంత అడిగే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ సినిమాలో ఆమె గర్భవతిగా కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు
ఇదీ చూడండి:ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు సిరీస్‌లివే