తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైతూ, అఖిల్​కు సవాల్ విసిరిన సమంత! - అఖిల్ ఏజెంట్ సినిమా

Samnatha VS Nagachaitanya Akhil: అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్​తో పోటీ పడేందుకు సిద్ధమైంది హీరోయిన్ సమంత. దీంతో సోషల్​మీడియాలో సామ్​ వర్సెస్​ అక్కినేని బ్రదర్స్ అంటూ నెటిజన్లు ట్రెండింగ్​ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోటీ ఏంటో తెలుసుకుందాం..

Samantha VS Akkineni brothers Nagachaitanya Akhil
Samantha VS Akkineni brothers Nagachaitanya Akhil

By

Published : Apr 6, 2022, 9:18 AM IST

Updated : Apr 6, 2022, 9:42 AM IST

Samnatha VS Nagachaitanya Akhil: విడాకుల తర్వాత హీరోయిన్​ సమంత, హీరో నాగచైతన్య ఎక్కడా తమ డైవర్స్​కు​ గల కారణాన్ని వెల్లడించలేదు. అలాగే ఒకరి గురించి మరొకరు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అయితే తాజాగా ఈ జోడీ మరోసారి నెట్టింట్లో హాట్​టాపిక్​గా మారింది. అందుకు కారణం సామ్​.. అక్కినేని బ్రదర్స్​ చైతూ, అఖిల్​తో పోటీ పడటమే. అదేంటి ఏం పోటీ అనుకుంటున్నారా? దాని గురించి ఈ కథనం..

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఈ సినిమాలో ఆమె ప్రెగ్నెంట్​గా నటిస్తోందని సమాచారం. తమిళనటి వరలక్ష్మి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. హరి-హరీశ్ దర్శకులు. అయితే ఈ మూవీ విడుదల తేదీని మంగళవారం ప్రకటించింది చిత్ర బృందం. ఆగస్టు 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు తెలిపింది.

అయితే ఈ విడుదల తేదీ ముందు రోజే (ఆగస్టు 11).. బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ఖాన్​తో కలిసి నాగచైతన్య నటించిన సినిమా 'లాల్​సింగ్​ చద్ధా' కూడా రిలీజ్​ కానుంది. మరోవైపు యశోద్​ విడుదల రోజే.. అఖిల్​ నటించిన 'ఏజెంట్​' చిత్రం కూడా రానున్నట్లు మేకర్స్​ ఇప్పటికే ప్రకటించారు. సురేందర్​ రెడ్డి డైరెక్ట్​ చేస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్​ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. అక్కినేని వారసులకు సామ్ గట్టి పోటీని ఇచ్చేటట్లు కనిపిస్తోంది. సోషల్​ మీడియాలో నెటిజన్లు కూడా 'సామ్​ వర్సెస్​ అక్కినేని బ్రదర్స్'​ అంటూ ట్రెండింగ్​ చేస్తున్నారు.

చైతూ ఫొటో షేర్​ చేసిన సామ్​.. నాగచైతన్య- సమంత చివరగా కలిసి నటించిన సినిమా 'మజిలీ'. ఫీల్​గుడ్​ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్​హిట్​గా నిలిచింది. ఏప్రిల్​ 5తో ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అయింది. దీంతో '3 ఇయర్స్​ ఫర్​ మజిలీ' అంటూ చైతూ పోస్టర్​ను షేర్​ చేసింది సామ్​. డైవర్స్​ తర్వాత సామ్​ తొలిసారి చై ఉన్న ఫొటోను పోస్ట్​ చేయడం వల్ల కాసేపట్లోనే ఇది నెట్టింట వైరల్​గా మారింది. అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

మజిలీ

ఇదీ చూడండి: 'వరుణ్​కు ఓపిక ఎక్కువ.. ఆ విషయంలో బాగా సహకరించారు'

Last Updated : Apr 6, 2022, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details