తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అదరగొట్టేసిన 'యశోద'.. ఉత్కంఠగా సామ్​ కొత్త మూవీ టీజర్‌ - యశోద సినిమా టీజర్‌

పుష్పలో ఐటమ్​ సాంగ్​ తర్వాత మంచి జోరు మీద ఉంది సమంత. త్వరలోనే యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్​ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.

Samantha Yashoda Teaser Release
Samantha Yashoda Teaser Release

By

Published : Sep 9, 2022, 11:37 AM IST

Updated : Sep 9, 2022, 11:58 AM IST

Samantha Yashoda Teaser Release : సమంత ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'యశోద'. హరి-హరీశ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సమంత గర్భిణిగా కనిపించనున్నారు. "కంగ్రాట్స్‌ నువ్వు ప్రెగ్నెంట్‌. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైమ్‌కి తినాలి. ఎక్కువసేపు నిద్రపోవాలి. జాగ్రత్తగా నడవాలి. ఇంట్లో పనులు చేయొచ్చు.. కానీ, బరువులెత్తకూడదు. ఏ పని చేసినా దెబ్బతగలకుండా చూసుకోవాలి" అంటూ వైద్యురాలు చెప్పే సూచనలతో ఈ టీజర్‌ సాగింది.

అయితే.. వైద్యురాలు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా 'యశోద' జీవితం సాగినట్లు.. తిండి, నిద్ర, ప్రశాంతత లేకుండా ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. తనకు ఎదురైన ప్రతి ప్రమాదాన్ని ఆమె మరింత ధైర్యంగా ఎదుర్కొన్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు యశోదకు ఎదురైన ప్రమాదం ఏంటి? ఆమెని ఇబ్బందిపెడుతోన్న వ్యక్తులు ఎవరు? ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈసినిమా సిద్ధమవుతోంది. ఇక, యశోదగా సామ్ నటన మెప్పించేలా ఉంది. పోరాట సన్నివేశాల్లో 'వావ్‌' అనిపించింది. ఈ సినిమా టీజర్‌ని షేర్‌ చేసిన సామ్‌.. "ధైర్యం, సంకల్పం" అని పేర్కొన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

Last Updated : Sep 9, 2022, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details