తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2022, 8:06 AM IST

ETV Bharat / entertainment

'యశోద' సీక్వెల్​పై​ క్లారిటీ.. సమంత ఓకే చెబితే వెంటనే సెట్స్​పైకి..

సమంత టైటిల్‌ పాత్రలో తెరకెక్కిన 'యశోద' సినిమా సీక్వెల్స్‌పై స్పష్టత ఇచ్చారు దర్శక నిర్మాతలు. సామ్​ ఓకే చెబితే వెంటనే పట్టాలెక్కిస్తామని తెలిపారు.

yashoda movie success meet
yashoda movie success meet

Samantha Yashoda Sequel: వెండితెరపై 'యశోద' సందడి మళ్లీ మళ్లీ కనిపించనుందా.. ఈ సినిమాని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించనున్నారా? అవుననే అంటోంది చిత్ర బృందం. సమంత టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా 'యశోద' సీక్వెల్స్‌పై స్పష్టత ఇచ్చారు దర్శక నిర్మాతలు. ''యశోద 2' విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది. అంతేకాదు మూడో భాగానికి ఓ లీడ్‌ ఉంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత.. ఆమెతో చర్చిస్తాం. తను ఒప్పుకుంటే వెంటనే సీక్వెల్స్‌ పట్టాలెక్కిస్తాం. మా నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారు. రెండో భాగంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పాత్ర కూడా ఉంటుంది. అలాగే మా చిత్రంలో సూపర్‌ సైంటిస్ట్‌ ఉన్ని ముకుందన్‌ ఉన్నారు. అతను కూడా ఏమైనా చేయగలడు (నవ్వుతూ)" అని చిత్ర దర్శకులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details