సమంత నటించిన యశోద చిత్రంలో ఈవా ఫెర్టిలిటీ సెంటర్ పేరును తొలగించినట్లు ఆ చిత్ర నిర్మాత శివలెంకల కృష్ణప్రసాద్ తెలిపారు. ఇక నుంచి ఆ చిత్రంలో ఈవా పేరు కనిపించదని వెల్లడించారు. ఈ మేరకు ఈవా ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు క్షమాపణ తెలిపిన నిర్మాత కృష్ణప్రసాద్.... ఈవా నిర్వాహకులతో సమస్య సద్దుమణిగిందని స్పష్టం చేశారు.
ఆ కేసు విషయంలో సామ్ యశోద మూవీకి లైన్ క్లియర్.. క్షమాపణలు తెలిపిన చిత్రనిర్మాత - సమంత యశోద మూవీపై కేసు
సమంత నటించిన యశోద చిత్రానికి ఓ కేసు విషయంలో లైన్ క్లియర్ అయింది. ఈ చిత్ర నిర్మాత కృష్ణప్రసాద్ క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్- వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ తమ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని కోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే వారిని కలిసి పేరు తొలగిస్తామని చెప్పామని, అన్నట్లుగానే పూర్తిగా ఆ పేరును తొలగించినట్లు వెల్లడించారు. యశోదలో ఈవా పేరును ఒకరిని ఉద్దేశించి పెట్టలేదని, ఎవరి మనోభావాలను కించపర్చేలానే ఆలోచన తమకు లేదన్నారు. అలాగే యశోద నిర్మాతల తక్షణే స్పందించిన పట్ల ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. తమ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవడానికే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందే తప్ప డబ్బుల కోసం కాదని మోహన్ రావు తెలిపారు
ఇదీ చూడండి:యాంకర్ సుమకు లవ్ ప్రపోజల్.. ఎవరబ్బా ఆ కుర్రాడు?