Samantha Vijay: 'విక్రమ్'తో మాస్ విందు ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడి తర్వాతి చిత్రం తమిళ స్టార్ హీరో 'విజయ్'తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా సమంత నటించనున్నట్లు సమాచారం. లోకేశ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కథా నాయికకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Samantha Vijay: విజయ్‌తో మరోసారి సమంత! ఆ కారణంతోనే..!! - lokesh kanagaraj vijay movie
Samantha Vijay: తమిళ సూపర్‌స్టార్ 'విజయ్'తో కలిసి అగ్ర కథానాయిక సమంత మరోసారి నటించే అవకాశం ఉంది. క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. కాగా, ఇప్పటికే పలు చిత్రాల్లో అలరించి హిట్ పెయిర్‌గా నిలిచారు సామ్-విజయ్.
thalapathy 67
విజయ్-సమంత జోడీ ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. 'దళపతి 67'గా వ్యవహరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'దళపతి 66' రెండో షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. సమంత.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రీకరణలో ఉంది. మజిలి, నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇదీ చూడండి:హాట్‌లుక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతున్న అమీ.. బికినీలో హొయలు పోతూ