Samantha Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నారు. మయోసైటిస్కు ట్రీట్మెంట్ తీసుకునేందుందుకు వెళ్లిన ఆమె.. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అంతకుముందు 'ఖుషి' సినిమాలో నటించిన సామ్...తాజాగా మూవీ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో గత వారం జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో మెరిసిన సమంత.. విజయ్ దేవరకొండ తో కలిసి డ్యాన్స్ చేసి ట్రెండ్ అయ్యారు. అయితే ఈ కాన్సర్ట్ తర్వాత బ్యాక్ స్టేజ్‌లో ఓ యాంకర్ సామ్-విజయ్‌లను చేసిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా విజయ్ గురించి సామ్ అన్న మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఆ వీడియోలో రష్మిక పేరు తీసుకోకుండానే సామ్ ఈ రిలేషన్షిప్ గురించి చిన్న హింట్ ఇచ్చారు. విజయ్ తనతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడరని.. కానీ వారిద్దరూ ఒకరికొకరు ఎక్కువగా మెసేజ్‌లు పెట్టుకుంటారంటూ నవ్వింది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. సామ్ కచ్చితంగా రష్మిక గురించే అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
ఇక విజయ్-రష్మిక మందన్న కలిసి 'గీతా గోవిందం', డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఆన్‌స్క్రీన్ లవ్లీ పెయిర్‌గా ట్రెండ్ సృష్టించిన ఈ స్టార్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని గతంలో ఈ జంట సమాధానమిచ్చింది. అయినప్పటికీ వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలిసి తిరిగిన సందర్భాలున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ జంట త్వరలో తమ లవ్ గురించి చెప్తే బాగున్ను అంటూ ఆశిస్తున్నారు.